రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

ఠాగూర్

ఆదివారం, 9 మార్చి 2025 (12:40 IST)
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ యువకుడు పాడుపనికి పాల్పడ్డాడు. డబ్బుందున్న మదంతో లగ్జరీ కారులో విహరిస్తూ రోడ్డు పక్కనే మూత్రవిసర్జన చేశాడు. అదీకూడా తన కారును రోడ్డు మధ్యలోనే ఆపేసి ఈ పాడుపనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 
 
వీడియోలో ఉన్న దృశ్యాల మేరకు పూణెలోని ఓ యువకుడు జంక్షన్ వద్ద రోడ్డుమీదే కారు నిలిపి అక్కడే మూత్రవిసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ నిందితుడుని, అతని స్నేహితుడుని గుర్తించి అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి తమ మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. ఆ సమయంలో కూడా ఆ యువకుడు మరింతగా రెచ్చిపోయి ప్రవర్తించాడు. 

 

రోడ్డు మధ్యలో కారు ఆపి.. అక్కడే కానిచ్చేశాడు!

పూణేలో ఓ యువకుడు జంక్షన్ వద్ద రోడ్డు మీదే కారు నిలిపి అక్కడే టాయిలెట్ పోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడ్ని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. వేరే వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేస్తుండగా.. ఆ యువకుడు ఇంకా… pic.twitter.com/y6lYIrzDQH

— ChotaNews App (@ChotaNewsApp) March 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు