భర్తను హత్య చేసి బీఎండబ్ల్యు కారులో కుక్కింది... కారు తాళాలు మర్చిపోయింది... ఏం జరిగింది?

సోమవారం, 20 మార్చి 2017 (15:56 IST)
ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి కాని భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో తన భర్తను తుపాకితో కాల్చి చంపిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఏకంసింగ్ థిల్లాన్ అనే వ్యక్తి భార్య సీరత్ థిల్లాన్. వీరి మధ్య ఏం గొడవ చేసుకున్నదో తెలియరాలేదు కానీ భర్తను తన తుపాకీతో కాల్చి చంపేసింది. ఆ తర్వాత అతడి మృత దేహాన్ని కిందికి తీసుకవచ్చి తన బీఎండబ్ల్యు కారు డిక్కీలో పెట్టింది. 
 
ఆ రాత్రివేళ శవాన్ని కారు డిక్కీలో అయితే పెట్టింది కానీ ఆ భయంలో కారు తాళాలు ఎక్కడో పడవేసుకుంది. ఎంత వెతికినా కారు తాళం కనబడలేదు. దాంతో ఉదయాన్నే తాళం చెవి వెతికి శవాన్ని సమీపంలోని కాలవలో పడేయాలనుకుంది. ఐతే ఇంతలో ఆ కారు సమీపానికి వచ్చిన కొందరు రిక్షా కార్మికులు కారు డిక్కీలో పెద్ద సూట్ కేసు వుండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే నిందితురాలు నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి తనే ఆ హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసు స్టేషనులో లొంగిపోయింది.

వెబ్దునియా పై చదవండి