పంజాబ్ రాష్ట్రంలోని భటిండా పట్టణానికి చెందిన ఓ మహిళకు అత్తమామల వేధింపులతో గర్భస్రావమైంది. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఆ వివాహిత నిస్సహాయస్థితిని అవకాశంగా తీసుకున్న డీఎస్పీ హరీందర్ సింగ్ తన కోర్కె తీర్చుకోవాలని ఆశపడ్డాడు.
దీంతో సదరు వివాహిత నేరుగా జిల్లా ఎస్పీని కలిసింది. అత్తమామలతో రాజీపడమని చెప్పడమేకాకుండా సదరు డీఎస్పీ తనను ఒంటరిగా రమ్మని చెప్పి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ హరీందర్ సింగ్‌పై విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశించగా, ఈ విచారణలో నిజంగానే డీఎస్పీ వివాహితను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.