కట్టుకున్న భర్త విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తే.. భార్య మాత్రం గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి ఆమెను మోసగించాడు. తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి.. వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియో చూపి బెదిరిస్తూ తమ కామవాంఛ తీర్చుకున్నారు. అంతటితో ఆగని ఆ కామాంధులు.. ఆ వీడియోను విదేశాల్లో ఉన్న కట్టుకున్న భర్తకు పంపించారు. దాన్ని చూసి షాకైన భర్త.. స్వదేశానికి వచ్చి.. భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి తగలబెట్టి... తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామానికి చెందిన కుల్విందర్ సింగ్(35) అనే వ్యక్తి ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తూ ఆరునెలలకు ఒకసారి వచ్చిపోయేవాడు. ఆయన భార్య, పిల్లలు మాత్రం స్వగ్రామం కలసింగియాలోనే నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.