రైల్వేశాఖ మే 1 నుంచి 27వ తేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి 5 మిలియన్ల మంది వలస కార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ఆకలి, వేడి వల్ల పలువురు వలస కార్మికులు రైళ్లలోనే మరణించారు. దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలస కార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది.
శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారని రైల్వే అధికారిక ప్రతినిధి వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. రైళ్లలో భోజనం దొరక్క ఎవరూ మరణించలేదని రైల్వేబోర్డు ఛైర్మన్ చెప్పారు.