పలు చోట్ల భారీ వర్షాలు.. శని, ఆదివారాల్లో..

శనివారం, 21 ఆగస్టు 2021 (10:26 IST)
ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ ప్రాంతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తూ వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. 
 
అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలిపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ట్వీట్‌ చేసింది. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడా లేదా ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయమని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు