రాజస్థాన్‌కు చెందిన ఓ జంట తమ దేశ భక్తిని నిరూపించుకున్నారు. పేరు మహావీర్ సింగ్, సోనం సింగ్. వీరిద్దరూ అజ్మీర్ నివాసులు. ఈ దంపతులకు ఈనెల 26వ తేదీన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకు మిరాజ్ రాథోడ్ సింగ్ అని పేరు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఇదే సమయంలో తమకు పండంటి మగ బిడ్డ పుట్టడంతో మిరాజ్ రాథోడ్ సింగ్ అని నామకరణం చేశారు. బాలుడి తండ్రి మహావీర్‌సింగ్ మాట్లాడుతూ తన కుమారుడు పెద్దవాడయ్యాక సైన్యంలో చేరుతాడన్న నమ్మకం ఉందని, అందుకోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.