రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్ - జైపూర్ జాతీయ రహదారిపై ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేపింగింపులో నిమగ్నమైవున్న వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అలాగే, వధువు కూడా తీవ్రంగా గాయపడింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.