మరోవైపు ఎనిమిది అడుగుల పొడవైన ఆ మొసలి అనంతరం కొంతసేపటికే చనిపోయినట్లు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు హేమంత్, నేహా తెలిపారు. మరణించిన ఆ భారీ మొసలిని ఆ తర్వాత కిసాన్ రైలులో తరలించి కర్జన్ అటవీశాఖకు అప్పగించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ సంతోష్ శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 25 నిమిషాలు నిలిచిపోగా, మిగతా రైళ్లు సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.