బెయిల్పై విడుదలై చెన్నై పోయస్గార్డెన్లోని తన నివాస గృహానికి చేరుకున్న సందర్భంగా రజినీ కాంత్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాసినట్లు అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో మీ రాక (అమ్మ) తమిళ ప్రజలకు అమితానందాన్ని ఇచ్చింది. మళ్లీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రశాంతత, ఆరోగ్యం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.