కోవిడ్-19పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు పలువురు సీనియర్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య సమన్వయంపై మంత్రులు సమావేశంలో చర్చించారు.
సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరానీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రామ్ విలాస్ పాశ్వన్, గిరిరాజ్ సింగ్, సంతోష్ గాంగ్వర్, రమేశ్ పోక్రియాల్, పియూష్ గోయల్ సమావేశానికి హాజరయ్యారు.