దేశం మొత్తం కరోనా వైరస్ గుప్పెట్లో ఉంది. అయితే, కర్నాటక రాష్ట్రంలో ఒకవైపు కరోనా ఫీవర్‌తో పాటు మంకీ ఫీవర్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో కర్నాటక వాసులు హడలిపోతున్నారు. ఆ రాష్ట్రంలో రోజురోజుకు ఈ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
వాస్తవానికి కరోనా ఫీవర్‌తో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సతమతమవుతోంది. మరోవైపు, కొత్తగా వచ్చిన మంకీ ఫీవర్ ప్రభుత్వాన్ని, ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది.