రాజ్యసభలో సచిన్‌కు చేదు అనుభవం.. వివరణ ఇచ్చిన సచిన్

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (15:43 IST)
రాజ్యసభ సభ్యుడైన క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఆయనపై జాలిచూపుతూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సచిన్... సభకు వెళ్లడం చాలాచాలా అరుదు. అయితే, గురువారం సభకు వెళ్లిన సచిన్‌ ఐదేళ్ళ తర్వాత తొలిసారి సభలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో ఒక్క మాట కూడా మాట్లాడలేక డకౌటయ్యాడు. అయితే గురువారం రాజ్యసభలో తాను ఏం చెప్పాలనుకున్నాడో శుక్రవారం తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా సచిన్ వెల్లడించాడు. 
 
"క్రీడలను ప్రేమించే దేశంగా పేరున్న ఇండియాను క్రీడలను ఆడే దేశంగా మార్చడం తన బాధ్యత అని మాస్టర్ సందేశమిచ్చాడు. తన ఈ కలను అందరి కలగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తనకు క్రికెట్ అంటే ప్రాణమని, దానిని గుర్తించి తనకు ఆడే స్వేచ్ఛను, హక్కును ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. రాజ్యసభ ఘటన ఊహించని విధంగా జరిగిపోయిందన్నారు. ఈ వీడియో చూస్తుంటే సచిన్ తీవ్రమనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు