బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. ఇది డేరా బాబా అసలు పేరు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బడుగు, బలహీనవర్గాలకు డేరాబాబా ఆరాధ్య దైవం. ఇతనికి లక్షలాది మంది భక్తులున్నారు. డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన డేరాబాబా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తన సామ్రాజ్యాన్ని మర్రి ఊడల్లా విస్తరించుకుంటూ పోయాడు. 2002లో డేరా బాబాపై హత్య, అత్యాచార కేసు నమోదైనప్పటి నుంచి బాబా కథ అడ్డం తిరిగింది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు.
అయితే డేరాబాబాపై ఉన్న అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీగా బలగాలను మోహరించారు. రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. హెలికాప్టర్‌లో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకు తోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ కొనసాగుతోంది. డేరా బాబా మద్దతుదారులపై హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముందుజాగ్రత్త చర్యగా పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హర్యానా వెళ్లే 200 రైళ్లను రద్దు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శాంతి భద్రతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోవద్దని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే నాయకులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇంకా బాబా అరెస్టుతో చేపట్టిన ఆందోళన కారణంగా ఏర్పడిన హింసలో 31మంది మరణించడంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు.