జైల్లో ఉంచినా ఉద్యమం ఆగదు.. అరెస్ట్ ఎందుకు? నేనే లొంగిపోతా : హార్దిక్ పటేల్

గురువారం, 26 అక్టోబరు 2017 (09:26 IST)
కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. 2015లో పటీదార్ ఉద్యమం సాగినప్పుడు మహేసనా ప్రాంతంలో జరిగిన విధ్వంసానికి కారకుడని హార్దిక్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
అప్పటినుంచి మహేసనా జిల్లాలోకి హార్దిక్ ప్రవేశాన్ని నిషేధించారు. ఈ విధ్వంసకాండకు సంబంధించి ఆయనపై వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసు విచారణకు ఆయన సక్రమంగా హాజరుకావడం లేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని భావిస్తే, ఆ అవసరం రానీయబోనని, లొంగిపోయేందుకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. అదేసమయంలో తనను జైల్లో ఉంచినా, పటీదార్ల ఉద్యమం ఆగదన్నాడు. తనపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. తాను లొంగిపోతానని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని, పోలీసులు బీజేపీ చెప్పినట్టు చేస్తున్నారని హార్దిక్ విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు