గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేఫ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే. పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ఉంటే, ఓ సంచిలో వేసుకుని సరి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్.
ఈ కేఫ్‌లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్‌ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెప్పారు.