జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:15 IST)
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాక్ కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగినట్టు ది వైర్ అనే పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని విపక్ష పార్టీలు మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసు విచారణ కోసం సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ లాయర్‌కు అనుమతినివ్వడం మరో వివాదానికి కారణమైంది. 
 
ఈనేపథ్యంలో బీజేపీ నేతలకు రిమోట్ కంట్రోల్‌గా పని చేసే ఆర్ఎస్ఎస్ ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. భోపాల్‌‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశం సందర్భంగా ఆర్ఎస్ఎస్ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబాలే మాట్లాడుతూ, ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై తప్పక విచారణ జరగాలన్నారు. అయితే, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని చెప్పారు. ఆయనపై ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు