బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సాధారణమైంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీని, కాంగ్రెస్‌ను పొగుడుతున్న వారు తమ భార్యలను, అమ్మాయిలను, కోడళ్లను ఆ రాష్ట్రానికి 15 రోజుల పాటు పంపండన్నారు.
'మహాభారత్' టీవీ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి మంచిపేరు తెచ్చుకున్న రూపాగంగూలీ.. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందన్నారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం దాదాపు నెలరోజులుగా ఆందోళనలు, కల్లోలాలు చోటుచేసుకుంటున్నాయని రూపా గంగూలీ గుర్తు చేశారు.