ఈ మెట్లకు వర్షం నుంచి రక్షణ కల్పించేలా హైడ్రాలిక్ రూఫ్ నిర్మిస్తోంది. ఈ యాంత్రిక రూఫ్ డిజైన్‌ను చెన్నైకి చెందిన కాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ అనే సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ రూపొందించింది. వర్షం లేనప్పుడు ఈ హైడ్రాలిక్ రూఫ్ రెండు వైపులా మూసేయవచ్చు. వర్షం వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తే రూఫ్‌లా మారిపోతుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.70 లక్షలు. అయ్యప్ప స్వామికి తన వంతు కానుకగా ఈ ఖర్చంతా విశ్వ సముద్ర సంస్థ భరిస్తోంది.