నవంబర్‌ 17 నుంచి తెరుచుకోనున్న అయ్యప్ప క్షేత్రం

గురువారం, 16 నవంబరు 2023 (12:45 IST)
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్‌ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు. 
 
రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జరగనున్నాయి. 
 
ఈ క్రమంలోనే మకర సంక్రాంతికి కనిపించే మకర జ్యోతి కోసం దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారనే సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు