రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, కూలదోచేందుకు కారణమై, పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకు దిగిన యువనేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించడమేకాకుండా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించింది.
మరోవైపు, సచిన్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రంలోపు తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ పదవి నుంచి సచిన్‌ను తొలగించిన వెంటనే ఆయన స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించారు.