ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.
దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్ను నశింపజేసి, కొవిడ్ సోకే ముప్పును తగ్గిస్తుంది.బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్ తో 3 రోజుల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్.అశోక్.
మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్ ధ్రువీకరించిన ఎయిర్లెన్స్ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.