తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్లో ఆరుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
మొత్తం 11 మందిలో ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవిత ఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు శంకర్ భార్య కౌసల్య వెల్లడించారు.