ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

సెల్వి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (22:12 IST)
Sasaram railway station
బీహార్ - మహా కుంభమేళాలో పాల్గొనడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న భక్తులు రైలు సేవల్లో జాప్యం, అంతరాయం కారణంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ప్రయాణికులు రైలుపై రాళ్లు రువ్వడం, ఏసీ కోచ్‌ల అద్దాల కిటికీలను పగలగొట్టడం, కంపార్ట్‌మెంట్లలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. మహిళలు, పిల్లలు సహా కొంతమంది ప్రయాణికులు పక్కనే ఉన్న కిటికీలు పగిలిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ప్లాట్‌ఫారమ్‌పై జనం గుమిగూడడంతో, కొంతమంది నిరాశ చెందిన ప్రయాణికులు కిటికీల గుండా ఎక్కేందుకు ప్రయత్నించగా, మరికొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
సమస్తిపూర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గురువారం రాత్రి ముజఫర్‌పూర్-సస్తిపూర్ లైన్‌లో ప్రయాణిస్తున్న స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వారు. ఈ దాడి ప్రయాణికుల్లో భయాందోళనలకు గురిచేసింది, ప్యాంట్రీ కారు అద్దాలు మరియు స్లీపర్ కోచ్‌లు పగిలిపోయాయి. 
 
కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి మరియు సమస్తిపూర్‌లోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యమైంది. 
 
ఈ నేపథ్యంలో ససారంలో రైళ్ల ధ్వంసానికి కారణమైన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ససారాం రైల్వే స్టేషన్ వద్ద రైలును ధ్వంసం చేసినందుకు బీహార్ పోలీసులు ఐదుగురి అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వారిని అరెస్టు చేసి, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండం ద్వారా భవిష్యత్తులో ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే ముందు వారి ఆత్మ కూడా భయపడుతుందని కామెంట్లు చేస్తున్నారు.

???? 5 people arrested by Bihar Police for vandalizing the train at Sasaram Railway Station. ????

Arrest them and give them BELT Treatment so that even their soul is scared before damaging public property in the future. pic.twitter.com/DKkaKwGjYt

— Gems (@gemsofbabus_) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు