చెన్నై ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత ప్రాతినిద్యం వహించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణంతో ఇపుడక్కడ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ స్థానం నుంచి తనే పోటీ చేస్తానని శశికళ సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్కే నియోజకర్గంలో శశికళ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు శశికళ పోటీ చేస్తే అంగీకరించేది లేదని ఆమె వ్యతిరేక కూటమి ప్రకటనలు చేస్తోంది.
మరోవైపు జయలలిత మేనకోడలు అధ్యక్షురాలిని చేస్తూ జెఅన్నాడీఎంకె పార్టీని స్థాపించనున్నట్లు న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించారు. అన్నాడీఎంకె పార్టీని శశికళ కబ్జా చేస్తున్నారనీ, దాన్ని తాము ఎంతమాత్రమూ అంగీకరించేది లేదని ఆయన ప్రకటించారు. కాగా జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్‌లో శశికళ అండ్ కో తిష్ట వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయ ఇంటిని మ్యూజియంగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.