జయలలిత దవాఖానాలో ఉన్నప్పటి వీడియో శశికళ వద్ద ఉందని తెలిపారు. ఆ వీడియో అపోలో దవాఖానా యాజమాన్యం వద్ద కూడా ఉందని చెప్పారు. అందులో జయ నైటీలో ఉన్నందున ఆ వీడియో విడుదల చేయలేదని, అవసరమైతే దర్యాప్తు అధికారికి ఆ వీడియోను అందజేస్తామని ప్రకటించారు.
ఇదిలావుండగా, జయలలిత మరణంపై నిజానిజాలు తేల్చేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ముగస్వామిని విచారణాధికారిగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది. జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపిస్తామని గత నెల 17న సీఎం పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.