ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు గట్టెక్కకపోవడంతో.. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడటం కోసం ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది.