మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబద్ధుడు. ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చేయాలంటే.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రిన్స్‌పల్ వేధించిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది.
పరీక్షల్లో పాస్ కావాలంటే తనతో శారీరక సంబంధం కలిగివుండాల్సిందేనని షరతు పెట్టాడు. అయితే ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.