కోడిని వేటాడిన చిరుతపులి.. ఎక్కడ? Video ఇదిగో...!!

ఠాగూర్

శుక్రవారం, 31 మే 2024 (08:48 IST)
ఇటీవలికాలంలో చిరుత పులులు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నారు. అడవుల్లో తగిన నీటి సదుపాయం, ఆహారం లభించకపోవడంతో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వచ్చి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలా వచ్చిన చిరుత పులులు మనుషులు, పశుపక్ష్యాదులపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలోని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ చిరుత పులి ఓ గ్రామంలోని వీధిలోకి వచ్చింది. 
 
ఇంటి పిట్టగోడపై ఉన్న కోడిని చూసిన ఈ చిరుత ఆ కోడిని వేటాడేందుకు ప్రయత్నించింది. ఒక్క సారిగా కోడిపై చిరుతపులి ఎగిరింది. అయితే, ఆ కోడి చిరుత పులి నోటికి చిక్కకుండా అక్కడ నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత ఆ చిరుత సాఫీగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
పరాయి మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్! 
 
మిస్ వైజాగ్‌ నక్షత్ర వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవం ఎదురైంది. తన భర్త పరాయి మహిళతో పడక గదిలో ఉండటాన్ని గుర్తించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. గతంలో మిస్ వైజాగ్ టైటిల్‌ను గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపించింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ, నక్షత్రల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు