పెళ్లయిన కొద్ది గంటలకే గుండెపోటుతో వధువు మృతి

బుధవారం, 3 మార్చి 2021 (13:47 IST)
మంగళూరు అడియార్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై కొన్ని గంటల తర్వాత వివాహ జీవితంలోకి ప్రవేశించిన వధువు గుండెపోటుతో మరణించింది. మంగళూరు అడియార్ కన్నూర్ సమీపంలోని బిర్పుగుడ్డే జమాత్ అధ్యక్షుడు కెహెచ్కె అబ్దుల్ కరీం హాజీ కుమార్తె 23 ఏళ్ల లైలాత్ అఫియాకి ముబారక్‌తో ఆదివారం అడయార్ కన్నూర్ జుమ్మా మసీదులో ఘనంగా జరిగింది. తరువాత, అడయార్ గార్డెన్‌లో విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేశారు.
 
ఆ తరువాత, ముబారక్ తన అత్తగారి ఇంటికి వచ్చారు. కొత్త జంట వేడుకలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వధువు అసియా తనకు గుండెల్లో నొప్పిగా వుందంది. ముబారక్ పెద్దలకు చెప్పేలోగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు