తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపట్న పోలీసుస్టేషను పరిధిలోని మాల్పాడా గ్రామానికి చెందిన వధువు 26 ఏళ్ల వయసున్న వరుడితో వివాహం నిశ్చయం చేశారు. మరికొద్దిసేపట్లో పెళ్లి అనగా వధువు తన ప్రియుడితో కలిసి పారిపోయింది.
అంతే వధువు చెల్లెలైన 15 ఏళ్ల వయసున్న మైనర్ బాలికకు నచ్చచెప్పి ఆమెను వరుడికిచ్చి పెళ్లి జరిపించేశారు. వధువు పారిపోవడంతో నివ్వెర పోయిన వరుడు అదే ముహూర్తంలో వధువు చెల్లైలైన మైనర్ బాలిక మెడలో తాళి కట్టేశాడు. పెళ్లి అనంతరం అత్తవారింటికి వెళ్లిన 15 ఏళ్ల బాలికా వధువును కలహండి జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా రక్షించారు.
బాల్యవివాహం చట్టవిరుద్ధమని వధువు, వరుడి కుటుంబసభ్యులకు తెలియదని సుకాంతి చెప్పారు. 10వతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న బాలికా వధువును రక్షించి పుట్టింటికి చేర్చామని, బాలిక తన పుట్టింటి నుంచి పరీక్షకు హాజరుకావాలని సూచించారు.