స్కూల్ మారథాన్ పోటీల్లో రెండో స్థానం... కొన్ని నిమిషాలకే విద్యార్థి మృతి

సోమవారం, 7 ఆగస్టు 2023 (09:59 IST)
పాఠశాల స్థాయి రిలే పరుగుపందెం పోటీల్లో ఒక విద్యార్థి పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతను ప్రాతినిథ్యం వహించిన పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే గుండెపోటు వచ్చిన మృత్యువాతపడ్డాడు. మృతుడి వయసు 15 యేళ్లు మాత్రమే. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర ఘట కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుమకూరు జిల్లాలో పాఠశాల స్థాయిలో పరుగు పందెం పోటీలను నిర్వహించాడు. ఈ పోటీల్లో భీమశంకర్ అనే విద్యార్థి పాల్గొన్నాడు. తన జట్టుతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థి విచారంలో కూరుకునిపోయాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే భీమశంకర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు