నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదాను తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆదివారం వైద్య కోర్సుల కోసం జరిగే నీట్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో సేలం జిల్లా, మేట్టూరు సమీపంలో నీట్ ఫియర్ కారణంగా ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాట పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్షలపై మండిపడ్డారు.