స్టాలిన్ గెలుపు ఖాయం, మంత్రుల శాఖలపై మంతనాలు చేస్తున్నారా?

శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:37 IST)
తమిళనాడులో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 2వ తేదీన వెళ్లడి కానున్నాయి. ఐతే ఓటింగ్ సరళిపై ఐ బ్యాక్ అనే సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో డిఎంకె పార్టీకి ఏకంగా 180 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు గంపగుత్తగా స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె పార్టీకి వేసేశారని సర్వే తెలిపింది.
 
అధికార అన్నాడీఎంకె పార్టీ నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితి తలెత్తుందని పేర్కొంది. కేవలం 20 నుంచి 30 సీట్లకే ఆ పార్టీ పరిమితమవుతుందని తేటతెల్లం చేసింది. కాగా ఇప్పటికే అన్నాడిఎంకె పార్టీ శ్రేణులు చప్పబడి పోయారనీ, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన సొంతు ఊరికి మకాం మార్చాడని చెప్పుకుంటున్నారు. మంత్రులు సైతం కిమ్మనకుండా ఎవరికి వారే అన్నట్లు వుండటంతో సీఎం పళనిసామి తీవ్ర నైరాశ్యంలో పడిపోయారని టాక్ వినిపిస్తోంది.
 
ఇదిలావుంటే స్టాలిన్ శిబిరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే స్టాలిన్ సీనియర్ నాయకులను పిలిచి గెలుపు అవకాశాలపై మాట్లాడుతున్నారట. మంత్రుల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక భాజపా కనీసం ఒక్కచోట కూడా గెలవలేని పరిస్థితిలో వున్నట్లు సర్వేలో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు