తోకతో పుట్టిన వింత శిశువు... ఆడో మగో గుర్తించే జననాంగాలు కూడా లేవు...

బుధవారం, 3 అక్టోబరు 2018 (18:18 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత శిశువు పుట్టింది. శరీర వెనుక భాగంలో తోక లాంటి భాగంతో జన్మించింది. పైగా, జననాంగాలు కూడా లేవు. దీంతో ఈ వింత శిశువును చూసేందుకు స్థానికులంతా క్యూకట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవారపేటలో ఈ వింత శిశువు జన్మించింది.
 
సోమవారపేటకు చెందిన జీకే మూర్తి అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయన భార్య చిన్నమ్మ నిండు గర్భిణి. ఈమెకు సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 
 
అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు. ఇలాంటి వింత శిశువులు జన్మించినప్పటికీ వారు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు