ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాజన్ను దైవదూతలా, నన్ను దెయ్యంలా మీడియా చిత్రీకరిస్తోంది. మీడియా ప్రచారం తీరు చూస్తే, మనల్ని రక్షించడం కోసం ఆయన విదేశాల నుంచి దిగివచ్చినట్టుగా ఉంది. ఆయన్ను మీడియా బాగా ఎత్తేస్తోంది. రాజన్ వైదొలిగితే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుందని మీడియానే భయపెట్టింది. కానీ వాస్తవంలో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచి.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులకు అప్పులు పుట్టకుండా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ నష్టం చేస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామి విమర్శలు ఎక్కుపెట్టారు.