ఈ నెల 26వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆ రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది.
ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. దేశానికి ఈశాన్యాన ఆకాశంలో ఈనెల 26వ తేదీన సాయంత్రం ఈ అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కృతం కానుంది.