కోవిడ్- 19 ప్రకటనల ఉపకరణాన్ని భారతదేశానికి విస్తరించిన ఫేస్‌బుక్‌

బుధవారం, 19 మే 2021 (17:51 IST)
భారతదేశంలో తాము కోవిడ్ 19 ఎనౌన్స్‌మెంట్‌ను విస్తరించామని ఫేస్ బుక్ వెల్లడించింది. భారతదేశంలోని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలోని ఆరోగ్య శాఖలు అవసరమైన కోవిడ్ 19 సంబంధిత సమాచారాన్ని తమ కమ్యూనిటీలకు పంచుకునేందుకు అవసరమైన ఉపకరణమిది. ప్రజా ఆరోగ్య అధికార యంత్రాంగం ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు మరియు కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన ప్రజా ఆరోగ్య సంక్షోభ సమయంలో తగిన సమాచారం పంచుకునేందుకు మద్దతునందిస్తూ తాము చేస్తోన్న ప్రయత్నాలలో ఇది ఓ భాగం.
 
యుఎస్‌ తరువాత ఈ ఫీచర్‌ను ఆవిష్కరించిన రెండవ దేశం ఇండియా. తాము ఇప్పటికే భారతదేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వారి సంబంధిత పరిధిలలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చాం. కోవిడ్ 19 ఎనౌన్స్‌మెంట్‌ ఫీచర్‌ ఇప్పుడు ఆరోగ్య శాఖలకు సమయానుకూల, విశ్వసనీయ కోవిడ్‌ 19 సమాచారంతో పాటుగా టీకా సంబంధిత సమాచారాన్నీ తమ స్థానిక కమ్యూనిటీలు/రాష్ట్ర పరిధిలోని ప్రజలతో పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రాలు ఈ హెచ్చరికలను తమ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే తమ రాష్ట్రాలలోని నిర్థిష్టమైన నగరాలకు మాత్రమే పరిమితం చేయవచ్చు.
 
ఫేస్‌బుక్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖ పేజీలపై పోస్ట్‌ చేసినప్పుడు కోవిడ్‌ 19 ఎనౌన్స్‌మెంట్స్‌గా మార్క్‌ చేస్తే తాము వాటి చేరికను మరింతగా విస్తరిస్తూ వారి కమ్యూనిటీకి చేరవేస్తాము. తద్వారా వారు చూసేందుకు తగిన అవకాశం అందిస్తాము. ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు నోటిఫికేషన్లను తాము పంపడంతో పాటుగా ఆ సమాచారాన్ని కోవిడ్‌ 19 సమాచార కేంద్రం వద్ద చూపుతాము. ఇది కోవిడ్ 19కు సంబంధించిన లేదంటే తమ కమ్యూనిటీలో కోవిడ్ 19కు టీకాలకు సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన అతి ముఖ్యమైన మరియు అత్యవసర సమాచారాన్ని పంచుకునేందుకు తోడ్పడుతుంది.
 
కోవిడ్‌ 19 ఎనౌన్స్‌మెంట్స్‌ను ఈ దిగువ అంశాలను ప్రజలకు చేరవేసేందుకు వినియోగించవచ్చు:
 
· ప్రస్తుత కోవిడ్‌- 19 వనరులు అయినటువంటి హెల్ప్‌లైన్స్‌ సంబంధిత సమాచారం.
 
·జిల్లాల్లో ఆస్పత్రిలలో పడకల లభ్యతకు సంబంధించిన సమాచారం అంటే, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయు) పడకలు, ఆక్సిజన్‌ మద్దతు కలిగిన పడకల సంబంధిత సమాచారం.
 
· ప్రస్తుత కోవిడ్- 19 నియమ నిబంధనలలో మార్పులు, అంటే లాక్‌డౌన్స్‌, నైట్‌ కర్ఫ్యూలు, చికిత్స మార్గదర్శకాలలో వచ్చిన మార్పులు, అవి కమ్యూనిటీలు మరియు ప్రజల రోజువారీ కార్యకలాపాలపై చూపే ప్రభావం గురించి.
 
· టీకాలకు అర్హత, నమోదు మరియు వ్యాక్సిన్‌లను పొందేందుకు రవాణా సంబంధిత సమాచారం.
 
· కోవిడ్-19 సంబంధిత ప్రవర్తన గురించి ఖచ్చితమైన సమాచారం.
 
· కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు నివారణ ఆరోగ్య చర్యలు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు