ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఆ స్థలంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాస గృహాలను నిర్మించనున్నట్టు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 'అంటే.. ఇక్కడ ఇకపై ప్రజల మానసికోల్లాసానికి స్థలం ఉండదా? వేరే చోట ఆ సౌకర్యాలు కల్పిస్తారా' అని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకొని సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. దాంతో ఆ ఒక్క విషయంపైనే మూడు రోజుల్లో సంక్షిప్తంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.