ఐతే విచారణ చేపట్టిన కోర్టు అబార్షన్ పిటీషన్‌ను తిరస్కరించింది. కడుపులో వున్న బిడ్డ వల్ల తల్లికి హాని కలుగుతుందని వైద్య పరీక్షల్లో తేలితేనే అబార్షన్ అనుమతి వుంటుందని స్పష్టీకరించింది. దీనితో అత్యాచారానికి గురయినప్పటికీ, వాడి వల్ల గర్భం దాల్చిన బాలిక శిశువుకు జన్మనివ్వాల్సిన పరిస్థితి. ఐతే దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవడో కామాంధుడు చేసిన దారుణానికి తమ బిడ్డ బతుకు బలవడమే కాకుండా అతడి పాపపు పని వల్ల నవమాసాలు ఎందుకీ శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. కానీ చట్ట ప్రకారం ఆమెకు అబార్షన్ సాధ్యం కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటివరకూ ఇలాంటి కేసులు మొత్తం 20 వేలకు పైగా వున్నట్లు సమాచారం. ఇవన్నీ భారతదేశంలోనే జరుగినట్లు చెప్పారు.