దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..

మంగళవారం, 6 నవంబరు 2018 (09:33 IST)
దీపావళి రోజు టపాసులు రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెద్దమొత్తంలో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. టపాసుల విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.  దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. 
 
ఇక క్రిస్మస్‌, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును తమిళ తంబీలు పట్టించుకోలేదు. నరక చతుర్దశి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లపైకి వచ్చి మరీ టపాకాయాలు కాల్చారు యువత. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ మనోభావాలకు ఈ తీర్పు వ్యతిరేకమని చెప్తున్నారు. సుప్రీం ఆదేశాలను రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వీటిని పాటించిన పరిస్థితి కనిపించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు