మహిళల ప్రవేశాన్ని కేరళీయులు స్వాగతించడం లేదు : కమల్ హాసన్

ఆదివారం, 21 అక్టోబరు 2018 (17:18 IST)
ప్రసిద్ధ శబరిమల ఆలయ పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రజలు స్వాగతించడం లేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అయ్యప్ప దర్శనం మహిళలకు కూడా కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఆదివారం స్పందించారు.
 
గతంలో కావేరీ వివాదంపై ఆనాడు కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించలేదని, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేరళీయులు స్వాగతించలేదన్నారు. ఈ విషయాన్ని పాలకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
అలాగే, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. శబరిమల ఆలయ సంప్రదాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను అందరూ గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో ఇతరులు వేలు పెట్టరాదన్నది తన అభిప్రాయమన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు