తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. నరమాంస భక్షకులు..

మంగళవారం, 27 జులై 2021 (18:04 IST)
తమిళనాడులో నరమాంస భక్షకులు కలకలం రేపాయి. తమిళనాడులో ఉండే కొంతమంది సమియాదీలు మనిషి పుర్రెను పట్టుకుని నృత్యాలు చేశారు. అంతేకాక అందరిముందు నరమాంసాన్ని తిన్నారు. తమిళనాడు టెంకాసీ జిల్లాలోని కల్లురానీ గ్రామంలో ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం కల్లురానీ గ్రామంలోని శక్తి పోతి సుడలై మదసామి ఆలయం(కాట్టు కోవిల్)లో జరిగిన వేడుకలో పాల్గొన్న కొందరు సమియాదీలు… మానవ పుర్రె చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు. 
 
అంతేకాక ప్రజల ముందే నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10మంది మియాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తినడం కోసం వారు ఎవరి శరీరాన్ని వెలికి తీశారో తెలుసుకోవటానికి కొందరు సమియాదీలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు తాము ట్రాన్స్ లోకి వెళ్ళామని మరియు ఆలయ దేవత తమలోకి ప్రవేశించదని సమియాదీలు చెబుతూ ఉండటంతో ఆ మృతదేహం ఎప్పుడు, ఎక్కడ నుంచి వెలికి తీయబడిందనే దానిపై పోలీసులకు ఇంకా ఆచూకీ లభించలేదు. కాగా, సగం కాలిపోయిన మానవ మృతదేహాన్ని ఏదైనా గ్రామ శ్మశానవాటిక నుండి తీసుకువచ్చారా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు