తమిళనాడులో ఘోర ప్రమాదం.. కారును ఓవర్‌టేక్ చేయబోయి (Video)

సోమవారం, 26 జులై 2021 (16:34 IST)
Car accident
హైవే మీద ప్రమాదాల గురించి వినే వుంటాం. హైవేల మీదే వాహనాలను జాగ్రత్తగా నడపాలి అని, వేగంగా వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఈ విషయాన్ని పాటిస్తున్నా కానీ కొంత మంది మాత్రం అసలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తమిళనాడులో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే సేలం జిల్లాలోని వజ్రప్పడి వద్ద వేగంగా వచ్చిన కారు మరొక కార్‌ని ఓవర్టేక్ చేయబోయి పక్కనే వెళుతున్న బైక్ ని ఢీ కొట్టింది. ఈ దృశ్యాలని వెనక వస్తున్న ఒక కార్ లోని వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేశారు.
 
ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆ కార్ ఆపకుండా అలాగే వెళ్లిపోయారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శివపురం పోలీసులు కేసు నమోదు చేసి ఆ కార్ గాలింపు చేపట్టారు. ఆ కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది అని అదే దారిలో వెళ్తున్న వాహనదారులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ కార్ లో ఉన్న వ్యక్తికి కఠిన శిక్ష వేయాలని అంటున్నారు.

Four injured in car terror attack on Shivapuram bypass near Vajappadi in Salem district of Tamil Nadu. #Chennai pic.twitter.com/yrQENQerhh

— DONTHU RAMESH (@DonthuRamesh) July 26, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు