టెక్కీ స్వాతి మర్డర్ కేసు ఓవర్.. ఎగ్మోర్ కోర్టు ప్రకటన

బుధవారం, 8 మార్చి 2017 (09:29 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగిసినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 
స్వాతిని హత్యచేసింది తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్‌ అనే యువకుడని, చూళైమేడులోని ఓ మేన్షన్‌లో బసచేశాడని, హత్య జరిగిన తర్వాత స్వస్థలానికి పారిపోయాడని పోలీసులు కనుగొన్నారు. 
 
అయితే అతడు అరెస్టయి.. జైలులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్మూరు కోర్టులో చెన్నై నగర పోలీసులు దాఖలు చేసిన స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి