తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

ఠాగూర్

ఆదివారం, 15 డిశెంబరు 2024 (22:27 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు. ఆయన వయసు 73 యేళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యతో అమెరికాలో ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు. 
 
తబలా మాంత్రికుడు అల్లారఖా కుమారుడైన హుస్సేన్.. సంగీతంలో తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ యేడాది ఆరంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని ఆయన కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన  సంగీత ప్రపచంచంలో మన దేశంతో పాటు ఎంతో మందిం అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు