తాజ్‌ మహల్‌కు బాంబు బెదిరింపు.. బలగాల మోహరింపు

గురువారం, 4 మార్చి 2021 (13:02 IST)
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు తాజ్‌ మహల్‌ రెండు ద్వారాలను మూసివేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరోఫోన్‌లో పోలీస్‌లకు ఫోన్‌ చేసి ప్రేమసౌధంలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు సమాచారం అందించాడు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్‌ మహల్‌లో సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక బలగాలను మోహరించారు. 
 
బాంబ్‌ స్క్వాడ్స్‌, డాగ్‌ స్క్వాడ్స్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. తాజ్‌ మహల్‌ను వీక్షించేందుకు వచ్చిన వారిని బయటకు తరలించారు. ఒక్కసారిగా బాంబు బెదింపు రావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎవరు ఫోన్‌ చేశారు.. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు