బాలికల బట్టలు విప్పించి నృత్యం చేయించిన పోలీసులు

గురువారం, 4 మార్చి 2021 (11:44 IST)
బాలికల హాస్టల్‌లోకి కొందరు మగవాళ్లు ప్రవేశించారు. వారిలో పోలీసులూ ఉన్నారు. కొందరు బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు.

ఓ కేసు విచారణ పేరుతో మహారాష్ట్రలోని జల్గావ్‌లో పోలీసుల దుర్మార్గం ఇది. దీనికి సంబంధించి ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియ్‌సగా లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్‌ అసెంబ్లీలో ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు