మూత్రం తాగాం... ఇక పెంట తింటాం.. మోడీ హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి లేస్తాం: తమిళ రైతులు

ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (11:31 IST)
కరవు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకోవాలంటూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ఆందోళనను ఇప్పట్లో ముగించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఈ ఆందోళన ఇప్పటికే 41 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా కలిసి ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. కానీ వారంతా సీఎం వినతిని తోసిపుచ్చారు. 
 
తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు తాము ఇక్కడ నుంచి కదలమని వారు సీఎంకు తెగేసి చెప్పారు. రుణమాఫీ, కావేరి బోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధరపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. వైవిధ్యభరితంగా వారు చేపడుతున్న నిరసన కార్యక్రమం ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు చేపట్టిన నిరసన శనివారం మూత్రం తాగారు. ఇక పెంట తింటామంటూ వారు ప్రకటించారు. దీంతో జాతీయ మీడియా సైతం ఈ రైతుల ఆందోళనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 

వెబ్దునియా పై చదవండి