ఈ విజయం డీఎంకే చరిత్రలో సరికొత్త అధ్యాయం : ఎంకే స్టాలిన్

ఆదివారం, 2 మే 2021 (16:55 IST)
త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకిరానుంది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్య‌మంత్రి అవ‌డం ఖాయ‌మైపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ విజ‌యంపై స్పందించారు. ఇది విజ‌యం ఊహించిందే అని ఆయ‌న అన్నారు. 
 
డీఎంకే చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అని స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. అయితే కొవిడ్ సంక్షోభం కార‌ణంగా కార్య‌క‌ర్త‌లు సంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాను. ప‌టాకులు లాంటివి కాల్చొద్దు అని నేను చెప్పాను. అయితే కౌంటింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర ఉన్న అంద‌రికీ చివ‌రి ఓటు లెక్కించే వ‌ర‌కూ వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశించాను అని స్టాలిన్ అన్నారు.
 
కాగా, సాయంత్రం 5 గంటల ట్రెండింగ్ మేరకు... 234 స్థానాల్లో డీఎంకే ఒంటరిగా 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అలాగే, డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 17, ఎండీఎంకే 4, సీపీఐ, సీపీఎంలు రెండే స్థానాల్లోనూ, వీసీకే 4 చోట్ల, ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
 
అదేవిధంగా అన్నాడీఎంకే ఒంటరిగా 68 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, మిత్రపక్షాలైన పీఎంకే 5, బీజేపీ 3, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంమీద డీఎంకే కూటమి 156 స్థానాల్లోనూ, అన్నాడీఎంకే 77 స్థానాల్లోనూ, కమల్ హాసన్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు